Amithab will act in Prabhas movie
క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి ప్రముఖ హీరోల వరకు బిగ్ బి అమితాబ్ తో నటించడానికి ఆసక్తి కనబరుస్తారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఆయనతో స్ర్కీన్ షేర్ చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఆ అవకాశం ప్రభాస్ కు దక్కింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, `మహానటి` డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతుంది. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్గా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది.
మరో విశేషం ఏంటంటే అబితాబ్ కూడా నటించబోతున్నారు. లెజెండ్ లేకుండా లెజండరీ సినిమాను ఎలా తీస్తాం? అని వైజయంతి మూవీస్ ప్రకటించింది. అయితే దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. ఎట్టకేలకు నా కల నెరవేరనుంది. అమితాబ్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని ఇన్ స్ర్టాగ్రామ్ లో తెలిపాడు.