
Amithabh voice gives to amazan’s Alexa
మీరు ఎప్పుడైనా అలెక్సాను యూజ్ చేశారా…? హలో అలెక్సా అనగానే డిఫరెంట్ వాయిస్ వినిపిస్తుంది. మీరు విన్న ఆ వాయిస్ అమెరికన్ నటుడు శామ్యూల్ ఎల్.జాక్సన్ ది. ఇక ముందు ఆయన వాయిస్ వినిపించకపోవచ్చు. ఎందుకంటే ఆయన స్థానంలో మన బిగ్ బీ అమితాబ్ వాయిస్ వినిపించనుందట. మన దేశంలోని హిందీ వినియోగదారుల కోసం అలెక్సా అమితాబ్ గొంతును వినిపించనుంది. ఒక సెలబ్రిటీ గొంతును వర్చ్యువల్ అసిస్టెంట్ కు వినియోగించడం ఇదే మొదటిసారి. ఇందుకోసం అమెజాన్ కంపెనీ అమితాబ్ తో డీల్ కుదుర్చుకోనుంది. ఇదే కనుక నిజమైతే మనం బచ్చన్ గొంతు త్వరలోనే వినొచ్చు మరి.