రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్

Amithsha Fire on Rahul Gandhi .. మోడీకి మద్దతిస్తే భయపెడటారా

బీజేపి చీఫ్ అమిత్ షా ,మరోసారి రాహుల్ గాంధి పై ఫైర్ అయ్యారు..యువరాజు రాహుల్ గాంధి బిజేపి కార్యకర్తలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు..దేశంలోని యువకులను నిరోధించడమే ఆయన లక్ష్యామా అంటూ ప్రశ్నించారు. బెంగుళూర్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.బెంగుళూర్ మాన్యాట్ టెక్ పార్క్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధి పాల్గోని ప్రసంగించారు..సభలో కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మోడికి అనుకూలంగా నినాదాలు చేశారు .అయితే నినాదాలు చేస్తూన్న వారిని అరెస్ట్ చేశారు..దీంతో అమిత్ షా స్పందించారు..భారత దేశ యువకులను మాట్లాడకుండా చేయడమేనా యువనాయకుడు రాహుల్ గాంధి ఆలోచన అని ప్రశ్నించారు..ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని దాన్ని, రాహుల్ గాంధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు .. మోడి మద్దతుదారులను అరెస్టుల ద్వారా భయపెట్టడడం మానుకోవాలని హెచ్చరిస్తూ…కర్ణాటక వింగ్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.మరో వైపు కార్ణాటక లో కాంగ్రెస్ ,జేడిఎస్ పార్టీల అప్రజాస్వామిక పరిపాలన తీరుకు నిదర్శనమని విమర్శించారు.ప్రజాస్వామ్య స్వేఛ్చను హరించి వారి నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *