అజిత్ ధోవల్ తో అమిత్ షా భేటీ ఎందుకు?

AMITSHAH MET AJITHDOWAL

అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై మరి కాస్సేపట్లో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించబోతున్న నేపథ్యంలో.. అందరి దృష్టినీ తన వైపు మరల్చుకున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఏకంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశం అయ్యారు.ఇంటెలిజెన్స్ బ్యూరో అధినేత అరవింద్ కుమార్ సహా హోం మంత్రిత్వ శాఖకు చెందిన కీలక అధికారులు దీనికి హాజరయ్యారు. దేశ రాజధానిలో తన అధికారిక నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. జాతీయ భద్రతా సలహదారు, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తో ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తి రేపుతోంది.రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించడానికి రెండు గంటల ముందే ఈ భేటీ ఏర్పాటైంది. అయోధ్యపై తీర్పు వెలువడిన అనంతరం చోటు చేసుకునే పరిణామాలపై ఆరా తీయడానికే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ ధోవల్ భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణంగా- హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఇలాంటి కీలక సమయాల్లో ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్ తో భేటీ నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై మూడో కంటికి తెలియకుండా సమగ్ర వివరాలను సేకరించే బాధ్యత ఇంటెలిజెన్స్ బ్యూరోదే.

తీర్పు వెలువడిన అనంతరం ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయి? వాటిని అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టారనే అంశంపై ఇంటెలిజెన్స్ చీఫ్ అరవింద్ కుమార్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలకమైన ఫొటోలు, ఇతరత్రా సమాచారాన్ని వారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తున్నారని చెబుతున్నారు. ప్రత్యేకించి- ఉత్తర్ ప్రదేశ్ సహా కొన్ని ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే చేపట్టిన భద్రతాపరమైన చర్యలపై ఫొటోలతో సహా వివరిస్తున్నారని సమాచారం.

tags: Ayodhya verdict, Supreme Court, central government,  Ranjan Gagoi, Chief justice of India, Amit shah, Ajithdhowal, union home minister

అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో చెలరేగితే జైలుకే

అయోధ్య తీర్పు పై షియా బోర్డు పిటిషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *