ఐపీఎస్‌ పాసింగ్ అవుట్ పెరేడ్ లోనే అరుణ్ జైట్లీ మరణ వార్త  విన్న అమిత్ షా

AMITTH SHA RETURN DELHI

రాజ్యాంగ స్పూర్తితో దేశ సేవకు అంకితమవ్వాలని శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లకు కేంద్ర హోం మంత్రి పిలిపునిచ్చారు.  రాజకీయ నాయకులుగా తమకు ఐదేళ్ల పాటు సేవ చేసే బాధ్యతను ప్రజలు ఇస్తారని.. ఐపీఎస్‌లుగా 30 ఏళ్ల పాటు దేశ సేవలో పాల్గొనే భాగ్యం మీ అందరికీ దక్కిందన్నారు. హైదరాబాద్ శివరాంపల్లి లోని సర్దార్ వల్లభాయ్ పటేల్  జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్ ల పాసింగ్  ఔట్ పరేడ్ కు  ముఖ్య అతిథిగా హాజరైన అమిత్  షా ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఐపీఎస్ లకు మెడల్స్  అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ నరసింహన్, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్అలీ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి ఢిల్లీకి పయనమయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన తన పర్యటనను మధ్యలోనే ఆపేసి… ఢిల్లీకి ప్రయాణమయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం ఢిల్లీని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తను బీజేపీ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మరణ వార్త తెలిసిన వెంటనే అమిత్ షా ఢిల్లీకి బయలు దేరారు.
హైదరాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శనివారం 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ కార్యక్రమంలో ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ మరణ వార్త వినాల్సి వచ్చింది.దీంతో.. వెంటనే కార్యక్రమాన్ని మధ్యలో ఆపేసి ఢిల్లీకి బయలుదేరారు.  తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అమిత్ షా… ఆ క్రమంలోనే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు.  కానీ అనుకోని దుర్వార్త వినాల్సి రావడంతో తన తెలంగాణ పర్యటననను అర్థాంతరంగా ముంగించాల్సి వచ్చింది.

ARUN JAITLEY IS NO MORE

tags: union home minister, amith shah , telangana, ips passing out parade , arun jaitley , death news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *