Amma Rajyamlo Kadapa Biddalu Review, Rating
సినిమా టైటిల్: అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు
నటీనటులు: అజ్మల్, రాము
మ్యూజిక్: రవి శంకర్
రచన: రాంగోపాల్ వర్మ – కరుణ్ వెంకట్
నిర్మాత: అజయ్ మైసూర్
దర్శకత్వం: సిద్ధార్థ్ తాతోలు
సెన్సార్ : యూ / ఏ
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఈ చిత్రం నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలను బేస్ చేసుకుని ఓ కథగా తెరకెక్కించిన సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. కమ్మ నిజానికి రాజ్యంలో కడప రెడ్లు అంటూ కాంట్రవర్సీ టైటిల్ తో మళ్ళీ హడావుడి చేసినా సెన్సార్ ఆగిపోయి టైటిల్ మారి ఇప్పుడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ వచ్చేశాడు ఆర్జీవీ. మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం..
కథ: ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్నాథ్‌రెడ్డి టార్గెట్‌గా ప్రతిపక్షాలు ఏకమౌతాయి. ఈ మేరకు మూకుమ్మడిగా సీఎం జగన్నాథ్రెడ్డిని టార్గెట్ చేస్తాయి. ఈ నేపథ్యంలో వెలుగుదేశం అధినేత బాబు, మనసేన అధినేత కళ్యాణ్ ఇద్దరు కలిసి సీఎంపై విమర్శలు మొదలెడతారు. అయితే రాజకేయం రంజుగా సాగుతున్న తరుణంలో బాబుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న దయినేని రమాను కొందరు వ్యక్తులు హత్య చేస్తారు. ఈ హత్యను చేధించేందుకు సీబీఐ ఆఫీసర్లుగా యాంకర్ స్వప్న, క్రిటిక్ కత్తి మహేష్ వస్తారు. ఈ హత్యను ఎవరు చేశారు? ఎందుకు చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తారు. ఇక క్లైమాక్స్‌లో వర్మ ఇచ్చిన ట్విస్టు ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఎలా ఉందంటే: అక్కడక్కడా కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా సెకెండ్ సరిగా మ్యానేజ్ చెయ్యలేకపోయాడు దర్శకుడు. ఇక .పప్పు లాంటి అబ్బాయి, చంపేస్తాడు లాంటి సాంగ్స్ విజువల్ గా ఆకట్టుకోగా, కొన్ని స్పూఫ్ లు కూడా ఉన్నంతలో కొద్ది వరకు మెప్పిస్తాయి, ఇంటర్వెల్ దగ్గర క్రియేట్ చేసిన ఆసక్తిని దర్శకుడు సెకండాఫ్‌లో కొనసాగించలేకపోయారు. తెలిసిన కథను బాగానే తెరకెక్కించారు కానీ.. కల్పిత కథను సరిగా అల్లలేకపోయారు. ఇక టెక్నికల్‌గా సినిమాను హై క్వాలిటీతో తెరకెక్కించారు. రవి శంకర్ అందించినమ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకున్నాయి.
(అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు రేటింగ్ 2.5/ 5)