యాంకర్ రవికి కారు ప్రమాదం… ఫుల్లుగా తాగి!

Anchor Ravi Car Accident

యాంకర్ రవి కారు ప్రమాదానికి గురయ్యారు. మూసాపేట్ వద్ద ఆగి ఉన్న రవి కారుని వెనుక నుంచి ఓ డీసీఎం వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రవి కారు వెనుక భాగం కొంత ధ్వసం కాగా..యాంకర్ రవి, అతని డ్రైవర్ సేఫ్ గానే ఉన్నారు. ఇక ప్రమాధానికి గురైన తర్వాత డీసీఎం డ్రైవర్ ని పట్టుకుని ప్రశ్నించగా తెలిసిందేమిటంటే అతగాడు ఫుల్లుగా మద్యం సేవించాడని తెలిసింది. దీంతో రవి స్థానిక సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. అనంతరం జరిగిన విషయాన్నీ ఓ వీడియో రూపంలో రిలీజ్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమో తెలిసినా ఇంకా అదేపనిగా తాగి వాహనాలు నడుపుతుండటం ఆందోళనకరం. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే. మరి పోలీస్ అధికారులు ఈ విషయంలో ఇంకొంచెం అప్రమత్తమవుతూ కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుంది. మద్యం సేవించి వాహనం నడిపిన వాడు బాగానే ఉంటున్నాడు.. ప్రమాదంలో బలవుతుంది అమాయకపు ప్రజలే.

Anchor Ravi Car Accident,Ravi claims his car was hit by a mini-truck,Sanath Nagar Police Station,Ravi shared a video,Moosapet, Popular Telugu TV host Ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *