Anganwadi Workers Laugh
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించమని మంత్రి కోరగానే అక్కడున్న ప్రజలంతా నవ్వుకున్నారు. మరి, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
బీజెపీ నేతల పాపం పెరిగినట్లు గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. బీజేపీ వల్ల అంబానీలకు, అదానిలకు తప్ప సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదని, త్వరలోనే ఈ సామాన్యులు అంతా కలిసి బీజేపీకి సరైన బుద్ధి చెబుతారని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, వరంగల్లో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా ఈ రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతున్నదని విమర్శించారు. అయినా కేసీఆర్ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదన్నారు. కరోనా సమయంలో కూడా అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించి ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటి చెప్పారన్నారు.
కోవిడ్ సమయంలో అంగన్వాడీలు అద్భుతంగా పని చేశారని, దీన్ని ముఖ్యమంత్రి గుర్తించారని, దానికి అనుగుణంగా త్వరలోనే ముఖ్యమంత్రి గారి నుంచి శుభవార్త ఉంటుందని వెల్లడించారు. ఇది వినగానే అంగన్ వాడీల్లో కొందరు ముక్కున వేలేసుకున్నారు. లోలోపల నవ్వుకున్న వారూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించమని మంత్రి కోరగానే అక్కడున్న ప్రజలంతా నవ్వుకున్నారు. మరి, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.