లోకేష్ పై సెటైర్

Spread the love

Anil Kumar caommented I am Not Mangalagiri Papu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో చర్చ రసవత్తరంగా సాగుతుంది. ఒఅర్ని మించి ఒకరు విమర్శలు, ప్ర్తివిమర్శలతో సభాపర్వాన్ని వేడెక్కిస్తున్నారు. గవర్నర్ ప్రసంగంపై తీర్మానించే అంశంపై మొదలైన చర్చ, గత ప్రభుత్వ వైఫల్యాలు,అవినీతి అంటూ అటు యూ టర్న్ తీసుకుంది. దీనిపై అధికపక్ష నేతలు ఘాటుగా విమర్శలు చేస్తుంటే, ప్రతిపక్షము నుండి ఒకే ఒక్క అచ్చెన్ననాయుడు మాత్రమే వారికీ దీటుగా మాట్లాడుతున్నాడు. ఇక పోలవలం గురించి ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ మాట్లాడిన తర్వాత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎదో అదృష్టం కలిసివచ్చి ఇరిగేషన్ మంత్రి అయిన వ్యక్తి మా బాబుగారికి నీతులు,పాఠాలు చెపుతూనే బాధగా అనిపిస్తుందని చెప్పాడు.
దీనితో అనిల్ కుమార్ మాట్లాడుతూ అధ్యక్షా..! ఆయన కొడుకు మాదిరి కనీసం నియోజకవర్గాన్ని పేరు పెట్టి పిలవలేక,”మంగళగిరిని మందలగిరిగా పిలిచే పప్పు” ని మాత్రం నేను కాదు అధక్ష్య.. నేను ఈ పదవికి కొత్తే కావచ్చు, కానీ తొందరగానే నేర్చుకుంటాం. కనీసం MLA గా కూడా గెలవలేని వాళ్ళకి MLC పదవి ఇచ్చి,మంత్రిని చేసిన మీ పప్పు లాంటివాడిని కాదు నేను. నలభై సంవత్సరాల అనుభవం చంద్రబాబు గారికి ఉండవచ్చు, అంత మాత్రాన ఆయన తప్పులు చేస్తూ,దోచుకోని తింటూ ఉంటే సైలెంట్ గా ఉండలేము. ఆయన చేసిన తప్పులను మేము చెపుతుంటే, ఆలా చెప్పకూడదు, యంగ్ స్టార్స్ రాకూడదు అంటే కుదరదు. చూపిస్తాం మా పవర్ ఏమిటో చూపిస్తాం..45 రోజుల్లో అన్ని బయటకు తీస్తాం అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *