టీడీపీకి షాక్ ఇస్తూ వంశీ బాటలో మరో నేత ?

Another Leader Shock To TDP

తెలుగుదేశం పార్టీకి మరో గట్టి దెబ్బ తగల బోతుందా? వల్లభనేని వంశీ బాటలోనే మరో నేత ప్రయాణించనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే వినిపిస్తోంది. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బోడె ప్రసాద్ తాజాగా జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పై ఓటమి పాలైయ్యారు. ఈయన పై వల్లభనేని వంశీకి ఆప్తుడిగా ముద్ర ఉంది. అధికారాన్ని కోల్పోయిన తరువాత , అంతకుముందు కూడా వంశీకి పార్టీలో అంతర్గతంగా ఎదురైన కొన్ని అవమానకర సందర్భాలు, పట్టాల పంపిణీ వ్యవహారంలో చోటు చేసుకున్న అవకతవకలు.. ఇవన్నీ దగ్గరుండి చూసిన నాయకుడు బోడె ప్రసాద్. అందుకే ఆయన కూడా వంశీ బాటలో వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.

వల్లభనేని వంశీ రాజీనామా చేసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ మధ్య కొనసాగిన ఆరోపణలు – ప్రత్యారోపణల ఎపిసోడ్ లో బోడె ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన పెద్దగా స్పందించలేదు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి వంశీ పై విమర్శలు గుప్పించాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసినప్పటికీ అయన అందుకు ఒప్పుకోలేదు. వంశీతో ఉన్న స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆయనపై విమర్శలు చేయలేదు కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని మాత్రం వంశీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సమయంలోనే జిల్లా రాజకీయాల్లో తన వ్యతిరేకులను రెచ్చగొట్టే పనిలో పార్టీలోని ఇతర నాయకులు ఉన్నారనే విషయం బోడె ప్రసాద్ దృష్టికి వచ్చిందని అంటున్నారు. వల్లభనేని వంశీ బయటికి వెళ్లిపోవడంతో ఇక తనకు అండగా ఉండే నాయకులు ఎవరూ లేరని భావించిన ఆయన వంశీ బాటలో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే కృష్ణా జిల్లా రాజకీయాల్లో టీడీపీలో మరో కీలక వికెట్ పడినట్టు అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

TAGS: vallabhaneni vamshi, bode prasad, tdp, ycp, party change, defection, chandrababu, krishna district, penamaluru
http://tsnews.tv/rtc-workers-are-in-tension/
http://tsnews.tv/srisailam-dam-in-danger/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *