కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతున్న మరో ఎమ్మెల్యే

Spread the love

Another MLA Tension For Congress

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారనున్నారా ? కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారా? కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ బాట పట్టిన నేపథ్యంలో ఆమె కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా ? నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల కోరిక మేర‌కు కాంగ్రెస్ ను వీడి తెరాస తీర్థం పుచ్చుకోనున్నారా ? అంటే ఏమో అంటున్నారు . ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క .. ఆమె పార్టీ మారతారని కొందరు, మారరని మరి కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు .

గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో జిల్లా రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు సీతక్క. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్లో చేరిన తరువాత రేవంత్ రెడ్డి స‌హ‌కారంతో టీడీపీలో కొనసాగిన సీత‌క్క ఆ త‌రువాత జ‌రిగిన రాజకీయ పరిణామాల కార‌ణంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేర‌డంతో ఆయనతోపాటు సీత‌క్క కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో రేవంత్ సహకారంతో ములుగు ఎమ్మెల్యే స్థానాన్ని ద‌క్కించుకుని టిఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి చందూలాల్ పై పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో, గ‌త నెల రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల కార‌ణంగా ఎక్కువ కాలం కాంగ్రెస్ లో కొనసాగారని టాక్ వినిపిస్తుంది. నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు, నేత‌ల ఒత్తిడి మేర‌కు సీతక్క టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.

ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ నుంచి పోటీ చేసిన పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు . ఇక ఆయ‌న ద్వారా టిఆర్ఎస్ అధినాయ‌క‌త్వం వ‌ద్ద‌కు వెళ్లి త‌న చేరిక‌కు మార్తం సుగ‌మం చేసుకునే ప‌నిలో సీత‌క్క ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు ప్రచారం జరుగుతుంది.అన్నీ కుదిరితే త్వ‌ర‌లో కేటీఆర్‌తో ఆమె భేటీ కానున్న‌ట్లు స్థానిక నేత‌లు చెబుతున్నారు.

కానీ సీతక్క టిఆర్ఎస్ లో చేరే అవకాశమే లేదని మరో వాదన సైతం వినిపిస్తుంది. కాంగ్రెస్‌ను వీడి సీత‌క్క టీఆర్ఎస్ లో చేర‌ద‌ని, కాంగ్రెస్‌లోనే వుంటార‌ని ఓ వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. మొదటి నుంచి రేవంత్ వర్గంగా ఉన్న సీతక్క, కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఉండగా, కాంగ్రెస్ ను వీడి వెళ్లదని టాక్ వినిపిస్తోంది. అయితే టిఆర్ఎస్ లో చేరే ముందు భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి వ‌ర్గం కూడా రమణారెడ్డి పార్టీ ఫిరాయించరని ప్రచారం చేశారు. తీరా గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరు పార్టీ మన ఆశ్చర్యపోనవసరం లేదు అన్న వాతావరణం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సీతక్క విషయంలో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *