ఓటీటీలోకి నవీన్ చంద్ర సినిమా

another movie in OTT

తెలుగులో మరో కొత్త సినిమా రాబోతోంది. మరీ డిఫరెంట్ కాన్సెప్టేం కాదు. కానీ కాస్త పాతదనం మిక్స్ అయిన కొత్త కథనం అనిమాత్రం అనిపిస్తోంది. అసలే లాక్ డౌన్ లో ఈ కొత్త సినిమా గురించి ఎలా తెలిసిందీ అంటారా.. సింపుల్..   ఓటిటిలో విడుదల కాబోతోన్న ఓ సినిమా ట్రైలర్ విడుదలైంది. టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ మూవీ పేరు భానుమతి రామకృష్ణ.. కాస్త ఏజ్ బార్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ సింపుల్ గా ఆకట్టుకుంటోంది. సిటీలో పాష్ లైఫ్ లీడ్ చేసే భానుమతి అనే అమ్మాయి. తన కంపెనీలో పనిచేసే అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ అతనేమో.. మరో మంచి అమ్మాయి దొరికిందని భానుమతికి హ్యాండ్ ఇస్తాడు. అందుకు ప్రధాన కారణం భానుకు 30యేళ్లు.అయినా పెళ్లి కానీ తన కంపెనీలో వర్క్ చేయడానికి తెనాలి నుంచి వస్తాడు రామకృష్ణ. 30యేళ్లకు పైగా ఊరుదాటి రాని అతను భానుమతితో ప్రేమలో పడతాడు.

మరి భానుమతి కూడా అతన్ని లవ్ చేసిందా అంటే ఏ తెలుగు సినిమా ఫాలోవర్ కు అయినా ఆన్సర్ దొరుకుతుంది. కానీ ఆ ప్రేమకథ, కథనం ఎలా సాగిందన్నదానిపైనే ఆసక్తి ఉంటుంది. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా కంటిన్యూ కాలేకపోయాడు. కథల ఎంపికలో చేసిన పొరబాట్లే నవీన్ కు హీరోగా అవకాశాలు తగ్గించాయి. ఏ పాత్రైనా చేయగలను అని నిరూపించుకుంటూ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఎప్పుడో చేసిన ఈ సినిమా సడెన్ గా తెరపైకి రావడం విశేషం. భానుమతి రామకృష్ణ అనే టైటిల్ తోనే ఇది ఎలాంటి ప్రేమకథో చెప్పారు. శ్రీకాంత్ నాగోటి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఏజ్ బార్ అయ్యాయిగా సలోనీ లుత్రా నటించింది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా కనిపిస్తోంది. కానీ సినిమాటోగ్రఫీ మాత్రం కాస్త నాసిరకంగా కనిపించిందని చెప్పాలి. మరి ఈ మూవీతో నవీన్ ఎలాంట రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *