విజయారెడ్డి సజీవదహనం ఘటన మరువకముందే మరో ఘటన

another revenue issue in mahabubabad

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రెవెన్యూ శాఖ అధికారుల పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారు అన్న విషయం అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి సజీవదహనం ఘటనతో తేటతెల్లమైంది. ఇక అప్పటినుండి రెవిన్యూ శాఖ అధికారులపై ప్రజలు విరుచుకుపడ్డ పరిపాటిగా మారింది. విజయ రెడ్డి సజీవ దహనానికి నిరసనగా ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులను లంచాలు తీసుకొని పని చేయలేదని, ఎన్ని రోజులు చుట్టూ తిప్పుకుంటారని మహిళ నిలదీసిన ఘటన మరిచిపోకముందే, తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం లోని మరిపెడ మండల కేంద్రంలో ఉన్న ఎమ్మార్వో ఆఫీస్ లో ఓ రైతు ఇతర డాక్యుమెంట్ల మీద ఎందుకు సంతకం చేయాలని ఏకంగా పెట్రోల్ బాటిల్ తీసుకొని వెళ్లి హల్ చల్ చేశారు. కుటుంబంతో సహా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన రైతు తమ పని చేయకుంటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతామంటూ నానా హంగామా చేశారు. విజయారెడ్డి సజీవదహనం ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎమ్మార్వో ఆఫీసుల వద్ద కనిపిస్తుండటం రెవిన్యూ శాఖ పనితీరుకు అద్దం పడుతుంది.

tags : vijayareddy murder, mahabubabad, maripeda, mro office, farmer family, petrol bottle, threaten

ల్యాండ్ పూలింగ్ ప్రకటించిన హెచ్ఎండీఏ

విజయారెడ్డి సజీవ దహనం చేసిన సురేష్ మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *