హైదరాబాద్ అదరగొట్టింది

Spread the love

ANOTHER WIN FOR SRH

  • 118 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ చిత్తు

ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో భారీ విజయం నమోదు చేసింది. ఏకంగా 118 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో విజృంభించిన సన్‌రైజర్స్‌ రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 113 పరుగులకే కుప్పకూలింది.

232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు ఘోరంగా విఫలమైంది. పార్థివ్‌ పటేల్‌(11), హెట్‌మెయిర్‌(9), విరాట్‌ కోహ్లి(3), ఏబీ డివిలియర్స్‌(1), మొయిన్‌ అలీ(2), శివం దూబే(5) తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. దీంతో బెంగళూరు 35 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తరుణంలో గ్రాండ్‌ హోమ్‌(37), ప్రయాస్‌ రే బర్మన్‌(19) ఏడో వికెట్‌కు 51 పరుగులు జత చేయడంతో ఆర్సీబీ కాస్త కుదుటపడింది. ప‍్రయాస్‌ రే ఔట్‌ అయిన తర్వాత ఉమేశ్‌ యాదవ్‌(14), చహల్‌(1)లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో 19.5 ఓవర్లలో ఆలౌటైంది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగుల స్కోరు సాధించింది. బెయిర్‌ స్టో(114; 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌(100 నాటౌట్‌: 55 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో సన్ రైజర్స్ ఐపీఎల్ లో అత్యుత్తమ స్కోర్ సాధించింది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *