ఓటీటీలో ‘నిశ్శబ్దం’

Anushka movie nishabdam released in OTT

స్విటీ అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కింది. అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్లలో సంద‌డి చేసేది. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయ‌న్న దానిపై క్లారిటీ లేక‌పోవ‌డంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. అక్టోబ‌ర్‌2న ‘నిశ్శబ్దం’ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేయ‌నున్న‌ట్లు నిర్మాత కోన వెంక‌ట్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఆ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ కొనుగోలు చేసింది. దీంతో ఓటీటీ వేదిక‌గా విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమాగా నిశ్శబ్దం నిల‌వ‌నుంది. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు నటించిన ‘వీ’ సినిమా విడుదలైంది. ప‌లు చిన్న సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అవుతున్నా పెద్ద సినిమాలు మాత్రం కాస్త ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఈ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియన్ కంటెంట్ డైరెక్టర్ విజయ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. మంచి స్టోరీ తోసిన సినిమాకు భాషతో పనిలేదు. ఇది అనుష్క తొలి డిజిటల్ సినిమా. ఓటీటీలో రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ది. ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *