అనుష్క కూడా ఆగనంటోంది..?

4
anushka movie update
anushka movie update

anushka movie update

బాహుబలి తర్వాత ఆ హీరోలాగా స్వీటీ బ్యూటీ అనుష్క దూకుడు చూపించలేకపోయింది. అలాగే తనకు ప్యాన్ ఇండియన్ రేంజ్ లో పెద్దగా క్రేజ్ కూడా రాలేదనే చెప్పాలి. సినిమాలో అనుష్కకూ మేజర్ షేర్ ఉంది. సెకండ్ పార్ట్ లో తను అద్భుతం అనిపించుకుంది. అయినా ప్రభాస్ తో పోలిస్తే చాలా తక్కువే అక్కడి ఆడియన్స్ లో గుర్తింపు వచ్చింది. భాగమతితో ఫర్వాలేదనిపించుకున్నా.. తర్వాత చేసిన నిశ్శబ్ధం సినిమా కేవలం బిజినెస్ కాకపోవడం వల్లే గత డిసెంబర్ లో విడుదల కాలేదు అనేది వాస్తవం. కానీ వాళ్లు మాత్రం ప్యాచ్ వర్క్ పేరుతో డిలే అయిందంటూ జనవరి 26 అనౌన్స్ చేశారు. అదీ పోయింది. తర్వాత ఫిబ్రవరి మీదుగా ఏప్రిల్ 2కు వచ్చింది. ఈ లోగా కరోనా రావడంతో ఏకంగా ఆగిపోయింది. మొత్తంగా కొన్నాళ్ల క్రితం నుంచే ఈ సినిమా ఓటిటిలో విడుదలవుతుంది అనే వార్తలు వస్తున్నాయి. సినిమా టీమ్ వీటిని ఖండిస్తూ వస్తోన్నా.. అమెజాన్ లో డీల్ కుదరకపోవడం వల్ల మాత్రమే ఆగింది తప్ప.. వాళ్లకు ఇష్టం లేక కాదు అని ఫిల్మ్ సర్కిల్స్ ఎప్పుడూ వార్తలు వచ్చాయి. మొత్తంగా కాస్త పెద్ద బడ్జెట్ తోనే రూపొందిన నిశ్శబ్ధం ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. మన సైట్ లో ఈ వార్త గతంలోనే చాలాసార్లు రాసి ఉన్నాం. మొత్తంగా అదే ఫైనల్ అయింది.

కాకపోతే సినిమా మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేసిన దాంట్లో సగం రేట్ కే అమెజాన్ వాళ్లు అడుగుతున్నారట. నిశ్శబ్ధం టీమ్ 40కోట్ల వరకూ ఎక్స్ పెక్ట్ చేసింది. కానీ అమెజాన్ వాళ్లు మాత్రం 18- 20 కోట్ల మధ్యే ఆగిపోయారంటున్నారు. తెలుగులోనే కాదు.. సినిమా విడుదలయ్యే ఐదు భాషలకూ కలిపే ఈ మొత్తంతో బిజినెస్ అంటున్నారు. ఒకవేళ అమెజాన్ కంటే ఇంకెవరైనా కాస్త ఎక్కువగా ఆఫర్ చేస్తే అప్పుడు ఆ వైపుకూ వెళ్లే అవకాశాలున్నాయి. కాకపోతే కంటెంట్ ను బట్టే కదా ఏదైనా.. నిశ్శబ్ధం ఏ దశలోనూ ఆడియన్స్ నుంచి అద్భుతమైన అటెన్షన్ డ్రా చేయలేకపోయింది అనేది నిజం. ఇది ఓటిటి వాళ్లకు కూడా తెలుసు కాబట్టే వాళ్లూ ఏమంత ఉత్సాహంగా లేరు. ఏదేమైనా వచ్చే రెండో వారంలోనే ఏదో ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ లో నిశ్శబ్ధం విడుదల అవుతుందనేది ఖచ్చితమే అంటున్నారు. ఇక అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీలో ఓ హాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు. మొత్తంగా భారీ అంచనాలతో వచ్చిన వి ఓటిటి ముందు చతికిలకపడింది. మరి నిశ్శబ్ధం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

tollywood news