గోదారోళ్లు దుమ్ము రేపారు

AP 1OTH RESULTS OUT

  • ఏపీ టెన్త్ ఫలితాల్లో తూర్పుగోదావరి టాప్
  • 19 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానం
  • 19 శాతం ఉత్తీర్ణతతో చివర్లో నెల్లూరు
  • మొత్తంగా 94.88 శాతం ఉత్తీర్ణత నమోదు

ఏపీ పదో తరగతి ఫలితాల్లో తూర్పుగోదావరి విద్యార్థులు దుమ్ము రేపారు. ఏకంగా 98.19 శాతం ఉత్తీర్ణతతో టాప్ లో నిలిచారు. రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. పేపర్ల మూల్యాంకనం అనంతరం మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి విజయవాడాలో వీటిని విడుదల చేశారు. మొత్తం 6,21,634మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 94.88 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈ సారి కూడా బాలికలే పై చేయి సాధించారు. పరీక్ష రాసిన బాలికల్లో 95.09 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, 94.68 శాతం మంది బాలురు పాసయ్యారు. జిల్లాలవారీగా చూస్తే 98.19 శాతం ఉత్తీర్ణతతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 83.19 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు చివరి స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. వీటిలో రెండు ప్రైవేటు పాఠశాలలు, ఒక ఎయిడెడ్ స్కూల్ ఉంది. ఇక జీపీఏ 10 పాయింట్లతో 33,972 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జూన్‌ 17 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *