అవినీతి పాలన మా ధ్యేయం అంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

Spread the love
AP Deputy CM Pushpa Shrivani says our focus is on corruption

రాజకీయ నేతలు ఏదో మాట్లాడాలనుకుంటారు. కానీ మీడియా మైకుల ముందు ఇంకేదో మాట్లాడతారు. నాలుక మడత పడడంతో నోరుజారి పూర్తి విభిన్న పలుకులు పలుకుతారు. దాంతో వారు చెప్పదలచుకున్న దానికి పూర్తి వ్యతిరేకమైన భావం బయటకొస్తుంది. ఇలాంటి ఘటనలు ఎన్నికల ప్రచారంలో చాలానే జరిగాయి. తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సైతం నోరు జారారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లా విజయనగరం వచ్చిన ఆమె..మీడియాతో మాట్లాడుతూ పప్పులో కాలేశారు.ఒకటే లైన్‌తో మన ప్రభుత్వం ముందుకెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్‌లో మా ధ్యేయం, మా ప్రభుత్వ ధ్యేయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు.’అవినీతి రహిత పరిపాలన చేయడమే సీఎం జగన్ ధ్యేయం.’ పుష్ప శ్రీవాణి చెప్పదలచుకున్న మాటలు ఇవి. కానీ మీడియా ముందు తడబడిన ఆమె..అవినీతి చేయడమే తమ లక్ష్యమని నోరుజారారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ నేతలు మనసులో మాటను బయటపెడుతున్నారంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *