తెలంగాణ మద్యంతో ఏపీ మందుబాబుల పండుగ

AP DRUNKARDS HAPPY IN TELANGANA

తెలంగాణ మద్యం ఏపీలో మందుబాబులకు కిక్కిస్తోంది. అదేంటి తెలంగాణ మద్యం ఏపీ లో అని ఆలోచిస్తున్నారా? అవునండి తెలంగాణ రాష్ట్రం తో పోల్చి చూస్తే ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువ. అంతేకాదు రాత్రి 9 గంటల లోపే మద్యం తాగాలి ఆ తర్వాత దుకాణాలు బంద్. ఇక వీటితో పాటు ఒక వ్యక్తికి ఇచ్చే మద్యం బాటిల్ పైన కూడా పరిమితి ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలో ఏపీ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఖమ్మం నల్గొండ జిల్లాల వైన్స్ కు ఏపీ లోని మద్యం ప్రియులు పోటెత్తుతున్నారు.. ఏపీలో మద్యం ధరలకు తెలంగాణలో మధ్య ధరలకు క్వార్టర్ కు రూ.30-40 తేడా ఉంటోంది. ఇక ఫుల్ బాటిల్ కు అయితే ఏకంగా 150-200 వరకూ తేడా ఉంది. దీంతో తెలంగాణలో చీప్ గా దొరికే మద్యం కోసం ఏపీ సరిహద్దున గల మందుబాబులు ఎగబడుతున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, వత్సవాయి పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాల వాసులంతా తెలంగాణ మద్యం షాపులకు క్యూ కడుతున్నారు. ఇక్కడ రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉండడం.. పైగా ఏపీతో పోలిస్తే తక్కువ ధరకు మద్యం దొరకడంతో తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వచ్చి మరీ కొనుక్కెళుతున్నారట.ఇలా తెలంగాణలో చీప్ గా దొరికే మద్యం కోసం ఏపీ సరిహద్దు జిల్లాల వాసులు ఎగబడుతుండడం తెలంగాణ ఎక్సైజ్ శాఖకు పండగలా మారింది. తెలంగాణ మద్యం కిక్కు ఏపీలో ఎక్కువగా కనిపిస్తోంది.

tags : telangana, wines shops, andhra pradesh, wines shops, drunkards, ap excise policy, rates hike, rules, khammam, nalgonda, krishna district

http://tsnews.tv/pawan-hot-comments-on-cm-jagan/
http://tsnews.tv/vamshi-hot-comments-on-chandrabaabu-and-lokesh/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *