కరోనాపై పోరాటానికి రూ. 200 కోట్లు…

AP Govt allotted rs.200 cr as emergency fund

ఏపీలో  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏపీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. ఇక దేశంలో కరోనా బాధితుల సంఖ్య నేటితో 31కి చేరటంతో ఏపీలో కరోనా కేసులు నమోదు కాకున్నా సరే తగు చర్యలు  చేపట్టింది. ఏపీలో ఇప్పటి వరకు ఒక్క పాజిటీవ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇక, కరోనా వైరస్ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సమావేశానికి సీఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  సీఎం జగన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దని ఆదేశించారు. కరోనాపై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించిన సీఎం.. గ్రామ సచివాలయాలను కరోనా వైరస్ నిరోధంలో భాగస్వాములను చేయాలన్నారు. మరోవైపు.. కరోనాను ఎదుర్కొనేందుకు రూ. 200 కోట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.

ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సీఎం వైఎస్ జగన్‌ కు  వివరణ ఇచ్చారు అధికారులు. విదేశాల నుంచి వచ్చినవారి వివరాలను సేకరిస్తున్నామని.. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన 6,927 మందికి స్క్రీనింగ్ చేశామని సీఎంకు తెలిపారు. విశాఖలో 790, గన్నవరంలో 60, కృష్ణపట్నంలో 469 మందికి.. విదేశాల నుంచి నౌకల ద్వారా వచ్చిన వారికి కూడా స్క్రీనింగ్ చేసినట్టు వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. 24 అనుమానిత కేసులకు టెస్ట్‌లను నిర్వహిస్తే… 20 నెగిటివ్‌గా వచ్చాయని.. మరో 4 కేసులకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రజలు కూడా భయపడకుండా, అపోహలకు గురి కాకుండా ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ లను విడుదల చేస్తున్నారు.

AP Govt allotted rs.200 cr as emergency fund,coronavirus,  covid 19,  wuhan,   california, usa, america, india, telangana, hyderabad, andhrapradesh, cm jagan mohan reddy, officials, review, fund, corona control, control rooms , isolation wards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *