ఏపీ లాక్ గౌడ్ గైడ్ లైన్స్

AP LOCKDOWN GUIDELINES

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ మినహాయింపునకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అత్యవసర వస్తుత్పత్తి పరిశ్రమలకు పరిమిత మినహాయింపులనిచ్చింది. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిబంధనలకు అనుగుణంగా మినహాయింపునిచ్చింది. లాక్ డౌన్ ఆంక్షలను పరిశ్రమల కోసం సడలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసిన సీఎస్ నీలం సాహ్నీ. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు లాక్ డౌన్లో పని చేసేందుకు అవకాశం కల్పించారు. ఉత్తర్వులను కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమలశాఖ, రవాణా, కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం పంపించింది.

రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు మినహాయింపునిచ్చారు. ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషద తయారీ సంస్థలకు మినహాయింపును ప్రకటించారు. సబ్బులు తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు, శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలు, ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు, అమెజానా, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలు వంటి వాటికి మినహాయింపునిచ్చారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపునిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు.

#YSJAGANUPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *