పాపం ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు

11
AP mptc zptc members dilemma 
AP mptc zptc members dilemma 

AP mptc zptc members dilemma

  • సెలవుల్లో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ
  • ఏడాది నుంచి ఎన్నికల కోసం ఎదురు చూపు

ఈ నెల 31న రిటైర్ కానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారం రోజుల పాటు సెలవు తీసుకున్నారు. మార్చి 16 నుంచి 24 వరకూ సెలవు తీసుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ టూర్ వెళుతున్నారు.  దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేనట్లేనని అర్థమవుతోంది. ఆయన మార్చి 31న రిటైర్ అవుతుండటంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. వాస్తవానికి, ఏడాది నుంచి ఈ ఎన్నికల కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. గతేడాది మార్చిలోనే అభ్యర్థులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న ఆశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులున్నారు. మరోవైపు ఏడాది కాలంగా ప్రజల్లో ఉండటానికి అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సేవా కార్యక్రమాల పేరిట పెద్ద ఎత్తున ఖర్చు చేశారు.  సుమారు ఏడాది నుంచి వివిధ కార్యక్రమాల్ని చేపడుతూ వచ్చారు.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అనే సందేహాం ప్రతిఒక్కర్ని పట్టి పీడిస్తోంది. అదే జరిగితే, రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ప్రజల్లోనే ఉండటానికి ఏడాది కాలంగా స్థాయికి మించి ఖర్చు చేశామని కొందరు వాపోతున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.

 

Ap Elections 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here