ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్.. నీలం సహని

AP NEW CS NEELAM SAHANI?

సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహని కేంద్రం నుంచి సోమవారం రిలీవ్ అయ్యారు. ఆమెను సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి ఏపికి రిలీవ్ చేస్తూ కేంద్రం ఆదేశాల్ని జారీ చేసింది. దీంతో, ఏపీకి కొత్త సీఎస్ గా నీలం సహనీ నియమితులు కానున్నారని సమాచారం.  కేంద్రం నుంచి రిలీవ్ కావడంతో త్వరలో సీఎస్ గా ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ అయిన తర్వాత సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అయిన నీరబ్ కుమార్ ప్రసాద్ ను తాత్కాలిక సీఎస్గా బాధ్యతల్ని ప్రభుత్వం అప్పగించింది. అయితే, వారం రోజుల క్రితమే జగన్ నీలం సహనితో కలిశారనే వార్తలు వినిపించాయి. అప్పట్నుంచే సీఎస్ మారే అవకాశముందనే వార్తలు గుప్పుమన్నప్పటికీ.. కొత్త సీఎస్ ఎవరనే ప్రశ్నపై కొంత డ్రామా నడిచింది. కాకపోతే, ఈ రేసులో సీనియర్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపించగా.. నీలం సహాని ఖరారైనట్లు సమాచారం.

AP POLITICAL UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *