ఏపీ ప్రజలు చంద్రబాబుకు దీర్ఘకాలిక సెలవిస్తారు

Spread the love

AP People will Give Holiday For Chandrababu… కేటీఆర్

ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని, అవసరమైతే ఏపీ నుండి బరిలోకి దిగుతామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న తమ పార్టీకి ఏపీలో అడుగు పెట్టాలన్న ఆలోచన ఏమాత్రం లేదని సంచలన వ్యాఖ్య చేశారు. ఒకవేళ పోటీ చేస్తే అది టిడిపి, కేసీఆర్ మధ్య పోరుగా చంద్రబాబు చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆయన అన్నారు. తమ పార్టీ ఎవరో ఒకరు అవకాశాలను ప్రభావితం చేస్తుందనడం వాస్తవాన్ని వక్రీకరించడం అవుతుందని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

ఇక త్వరలో ఏపీ ప్రజలకు కేసీఆర్ ఒక అప్పీల్ చేయబోతున్నారంటూ చెప్పిన కేటీఆర్ ప్రజలకు కేసీఆర్ చేయబోయే అప్పీల్ గురించి కూడా వివరించారు.

ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ చెప్తున్నారు అని చెప్పారు కేటీఆర్. చంద్రబాబు గందరగోళం మనిషిని చంద్రబాబు రాజకీయాలకు వీడ్కోలు పెరగడం ఖాయమని అన్న కేటీఆర్ అన్న కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సుస్పష్టంగా తెలుస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు దీర్ఘకాలిక సెలవు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవడం కోసం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తూ ఒక అభ్యర్ధన చేయనున్నారని కేటీఆర్ తెలిపారు.

ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న లోక్ సభ, స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడమే తన ముందున్న లక్ష్యం అని చెప్పిన కేటీఆర్ క్షేత్ర స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో వేలు పెడితే నేను టిఆర్ఎస్ పార్టీ ఏపీ ప్రజలకు అప్పీల్ చేయడానికే పరిమితం అవుతుందని కేటీఆర్ చెప్పిన మాటల ద్వారా అర్ధం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *