ఏపీలో నేడు టీడీపీ ఛలో పల్నాడు టెన్షన్

AP TDP Palnadu Tension

ఏపీలో ఛలో పల్నాడు టెన్షన్ పుట్టిస్తోంది. ఇక టిడిపి నిర్వహిస్తున్న ఛలో పల్నాడు, ఛలో ఆత్మకూరుకు పోటీగా వైసీపీ నేతలు కూడా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం తమను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ ఆందోళనలు నిర్వహించిన టిడిపి నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే చలో పల్నాడు చలో ఆత్మకూరుకు అనుమతి లేదని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఈ ఆందోళన అడ్డుకోవడానికి విఫల యత్నం చేస్తున్నారు. చంద్రబాబుతో సహా పలువురు ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
ఛలో పల్నాడు సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా పల్నాడులోని తెలుగుదేశం పార్టీ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక గుంటూరు లో ఉన్న ముఖ్య నేతలపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యనేతల కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. టీడీపీ కార్యాలయం, బాధితుల శిబిరం, టీడీపీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసుల్ని మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతల దాడులకు గురైన బాధితులను తీసుకొని ఆత్మకూరు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున పాల్గొనేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో దాదాపుగా 200 మంది ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల పై దాడులు పెరిగిపోయాయని, మమ్మల్ని చంపేస్తారా రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వైసిపి పాలనలోకి వచ్చిన దగ్గరనుండి ఇప్పటివరకు టీడీపీ శ్రేణులు పై జరుగుతున్న దాడులపై సహనం కోల్పోయిన టిడిపి నాయకులు వైసీపీ తీరుపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇక దాడులకు గురైన వారందరినీ పోలీసులు గ్రామాలకు తీసుకెళ్లాలన్న చంద్రబాబు చాలెంజ్ ను మొదట పోలీసులు లైట్ తీసుకున్నారు. కానీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బాధితులను పునరావాస శిబిరం నుంచి గ్రామాలకు తీసుకెళ్తామని, ఎటువంటి ఇబ్బందిలేకుండా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే ప్రతీకార దాడుల సమస్య ఒక్క పల్నాడులో మాత్రమే లేదని రాష్ట్రం మొత్తం ఉందని.. టీడీపీ చెబుతోది. అక్రమ కేసులను ఎత్తివేయటమే కాకుండా బాధితులకు,నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు టిడిపి నాయకులు. దాంతో బాధితులు పోలీసులతో వెళ్లేందుకు సిద్ధపడలేదు. అయితే గుంటూరులోని బాధితుల శిబిరం వద్ద.. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పదుల సంఖ్యలో వాహనాలు సిద్ధం చేశారు. బలవంతంగా వారిని ఆయా గ్రామాలకు తీసుకెళ్లి విడిచి పెట్టేందుకు ఏ క్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ నేతలు మాత్రం పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి విభిన్న మార్గాల ద్వారా పల్నాడుకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Political Crime News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *