APARNA RS.6 CRORE DONATION
హైరైజ్ అపార్టుమెంట్లు, లగ్జరీ విల్లాల నిర్మాణాల్లోనే కాదు.. సామాజిక బాధ్యతలోనూ తాము అగ్రగాములమని అపర్ణా సంస్థ మరోసారి నిరూపించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉహించని రీతిలో కొనసాగుతున్న వరదల స్థితి నుంచి బయటపడేందుకు తగిన తోడ్పాటును అందించేందుకు వ్యాపార సంస్థలు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ అభ్యర్థనకు అపర్ణా సంస్థ సానుకూలంగా స్పందించింది. మంగళవారం సాయంత్రం సుమారు రూ.6 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ ఎస్ ఎస్ రెడ్డి మాట్లాడుతూ.. అపర్ణా సంస్థ సమాజ సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ప్రస్తుత సమస్య నుంచి బయటపడేందుకు ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు తాము పూర్తి స్థాయి మద్ధతును అందిస్తామ’ని తెలిపారు.
అపర్ణా సంస్థ గత కొద్ది సంవత్సరాలుగా సామాజిక, సంక్షేమం, ఆరోగ్యసంరక్షణ విభాగాల్లో స్థిరంగా పని చేస్తుంది. తమ సీఎస్సార్ విభాగం, అపర్ణా నావెల్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఆన్సర్) ద్వారా పలు కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాల్ని చేపట్టింది. వీటి ద్వారా పేద వర్గాల చిన్నారులతో పాటు పెద్దల జీవిత నాణ్యతను మెరుగు పరిచేందుకు లక్ష్యంగా చేసుకుంది.