Apex Council Meeting
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ, తెలంగాణ జగన్మోహన్ రెడ్డి, కేసీర్ (వీడియో కాన్ఫరెన్స్ లో) ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశం జరిగింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో డీపీఆర్ లను సమర్పించాలని కేంద్ర జలవనరుల శాఖ ఏపీకి సూచించింది. డీపీఆర్ లు కేంద్రానికి అందజేసే వరకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవద్దని తెలిపింది. అయితే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ సీఎం కేసిఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాయలసీమ, ఎత్తిపోతల పథకం ద్వారా పాత ఆయకట్టుకు నీటి తరలింపు విషయాలను సీఎం జగన్ అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు.