అర్జున్ ఫ్యామిలీని వెంటాడుతోన్న కష్టాలు

4
arjun in troubles
arjun in troubles

arjun in troubles

యాక్షన్ కింగ్ గా సౌత్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్ అర్జున్. దేశభక్తి మాస్ చిత్రాలతో మాంచి ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నాడు అర్జున్. అలాగే దర్శకుడుగానూ ఎన్నో సినిమాలతో విజయం సాధించాడు. అలాంటి అర్జున్ కు వారసులుగా అతని మేనల్లుళ్లు కన్నడ సినిమా పరిశ్రమలో పరిచయం అయ్యారు. మామూలుగా అర్జున్ ఫాదర్ కూడా పరిశ్రమకు చెందిన వాడే. అంటే వీళ్లు మూడో తరం వారసులన్నమాట. ఇక రీసెంట్ గా అర్జున్ మేనల్లుడు కన్నడలో మాస్ హీరోగా ఎదిగి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్న చిరంజీవి సర్జా గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. కొన్నాళ్ల క్రితమే నటి మేఘనా రాజ్ ను పెళ్లి చేసుకున్న చిరంజీవి లాక్ డౌన్ టైమ్ లో కూడా ఫ్యాన్స్ తోనూ, ప్రేక్షకులతోనూ బాగా ఇంటరాక్ట్ అయి అనూహ్యంగా హార్ట్ ఎటాక్ తో మరణించడం ఆ ఫ్యామిలీని షాక్ కు గురి చేసింది. ఇక ఈ సంఘటన తర్వాత వారం క్రితమే అతని మరో మేనల్లుడు ధృవ్ సర్జాతో పాటు అతని భార్య ప్రేరణ శంకర్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆ ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది.

అయితే ఈ ఇద్దరికీ వైరస్ మరీ ప్రమాదకరంగా లేకపోవడం కొంత ఊరట. ఇదే టైమ్ లో ఇప్పుడు అర్జున్ కూతురు నటి ఐశ్వర్య అర్జున్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఐశ్వర్యే స్వయంగా ప్రకటించడంతో కన్నడ పరిశ్రమలో చాలామంది ఇదైపోతున్నారు. ముఖ్యంగా అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తమ కుటుంబానికి ఏదో అయిందనే భయంలో పడిపోయారు. ధృవ్ సర్జాతో పాటు ఐశ్వర్యలు కూడా డాక్టర్స్ పర్యవేక్షనలో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తనకు ఏ ఇబ్బందీ లేదని ఐశ్వర్య చెప్పడం చూస్తోంటే ప్రమాదం లేదని తెలుస్తోంది. కానీ ఒకే కుటుంబానికి వరసగా ఇన్ని సమస్యలు వస్తుండటం మాత్రం వారి అభిమానులను కలచి వేస్తోంది. ఏదేమైనా ధృవ్ దంపతులతో పాటు ఐశ్వర్య కూడా త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం..

tollywood news