అర్జున్‌ రెడ్డి` తమిళ టైటిల్‌ మారింది…. 

Spread the love
Arjun Reddy Tamil Title was Changed
విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ సెన్సేషనల్‌ సక్సెస్‌ సాధించడంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్‌, కోలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు. కోలీవుడ్‌ విషయానికి వస్తే చియాన్‌ విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా రూపొందుతోంది. ముందు బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్‌ కాపీ నిర్మాతలకు నచ్చకపోవడం.. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ రావడంతో ధృవ్‌ మినహా బాలా సహా ఎంటైర్‌ యూనిట్‌ను నిర్మాతలు చేంజ్‌ చేసేస్తున్నారు. అందులో భాగంగా హీరోయిన్‌ బనితా సంధుని ఎంపిక చేసుకున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రవి.కె.చంద్రన్‌ను తీసుకున్నారు. లెటెస్ట్‌ న్యూస్‌ ప్రకారం ఈ సినిమా టైటిల్‌ను వర్మ నుండి ఆదిత్య వర్మగా మార్చారు.

Check out here For More News

For More Interesting and offers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *