దిశా ఇంటికెళ్లక… పెళ్లికి వచ్చావా?

As nation boils over Telangana rape case

బాధితురాలి ఇంటికెళ్లి పరామర్శించడానికి సమయం లేదు కానీ… ఢిల్లీలో హై ప్రొఫైల్‌ వెడ్డింగ్‌కు రావడానికి మాత్రం తీరికా ఉందా అంటూ తెలంగాణా సీఎం కేసీఆర్‌ను డైరెక్ట్‌గా విమర్శిస్తోంది నేషనల్‌ మీడియా. ​

​రోజులు గడుస్తున్నాయ్‌. న్యాయం కావాలంటూ ఆందోళనలు హోరెత్తుతున్నాయ్‌. ఇంత జరుగుతున్నా దిశా విషయంలో కేసీఆర్‌ ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడింది లేదు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించింది లేదు. ఆడవాళ్ల వైపు చూడాలంటే లాగులు తడిసిపోవాలి కొడుకులకు అంటూ అప్పుడెప్పుడో ఆవేశంగా ప్రసంగించిన కేసీఆర్‌ ఇంత జరిగినా స్పందించకపోవడంపై అందరూ ప్రశ్నిస్తున్నారు. అయినా కానీ తెలంగాణా ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు. ​
మధ్యలో ఆర్టీసీకి వరాలు కురిపించడానికి మీడియా ముందుకొచ్చిన సీఎం ప్రస్తుతం ఢిల్లీ టూర్‌లో ఉన్నారు. ఘటన జరిగిన దగ్గర్నుంచి మన మీడియాకి పోటీగా కవరేజ్‌ ఇస్తోన్న నేషనల్‌ మీడియా టీఆర్‌ఎస్‌ నేతలను ఉతికి ఆరేస్తోంది. ఇప్పటికే చర్చల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీ క్లాస్‌లు పీకించుకోగా… ఇప్పుడు ఏకంగా కేసీఆర్‌ మీద విమర్శలు ఎక్కు పెట్టింది. మీ రాష్ట్రంలో అంత పెద్ద ఘటన జరిగి దేశం అట్టుడికిపోతుంటే మీరు మాత్రం పెళ్లిళ్లు పేరంటాలు కోసం తిరుగుతారా అంటూ ప్రశ్నిస్తోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టి పెట్టగానే చుట్టుముట్టిన మీడియా సర్‌ మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు…? బాధితురాలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ ఉక్కిరిబిక్కిరి చేసింది. హైద్రాబాద్‌ సేఫ్‌ అయితే మీ పాలనలో ఇలాంటి ఘటనలేంటి…? అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే యాజ్‌ యూజువల్‌గా కేసీఆర్‌ సాబ్‌ ​వీళ్లకి కూడా సమాధానాలు చెప్పకుండా వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *