అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Hot Comments On Ayodhya Verdict
అయోధ్య తీర్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీ  సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం స్వాగతిస్తున్నామని  చెబుతూనే ఈ తీర్పు  అసంపూర్తిగాఉందని,  అసంతృప్తిని కలిగించిందని పేర్కొన్నారు.  సుప్రీంకోర్టు ఒక వర్గం వారికి తీర్పు ఇచ్చినట్లుగా అనిపిస్తుందని  ఆయన అభిప్రాయపడ్డారు.  అక్కడ బాబ్రీ మసీదు ఉందన్న విషయం శాస్త్రీయంగా తేలిందన్నారు అసదుద్దీన్ ఓవైసీ, ఈ విషయంలో ముస్లిం దానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.  ఐదెకరాల భూమి తమకు అవసరం లేదని,  తాము ఎవరినీ భూమి కావాలని  యాచించ లేదని పేర్కొన్నారు. ఎవరి వద్ద తమ చేతులు చాప లేదని ఆయన అన్నారు. తాము న్యాయబద్ధంగా పోరాటం చేసి బాబ్రీ మసీదు భూమిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు.  బాబ్రీ మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మేము మరోసారి   కోర్టును పునఃపరిశీలించాలని కోరతామని  అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.  రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తమ హక్కుల కోసం కచ్చితంగా పోరాడతామని  అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.   భారతదేశంలో ఉన్న ముస్లింలు మసీదుకు ఐదెకరాల భూమిని పొందలేని అణగారిన వర్గాల వారు కాదు అని  ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
tags: Ayodhya Verdict, SupremeCourt, Central government, #RanjanGagoi, #ChiefJusticeOfIndia, Hindus, Muslims, Asaduddin Owaisi
http://tsnews.tv/andhra-pradesh-new-districts/
http://tsnews.tv/modi-tweet-after-ayodhya-verdict/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *