అసలేం జరిగింది మూవీ సస్పెన్స్ లవ్ స్టొరీ టీజర్

Asalem Jarigindi Movie Teaser

శ్రీరామ్, సంచితా పదుకొనే జంటగా ఎక్సోడస్ మీడియా పతాకంపై నిర్మించిన  సస్పెన్స్ లవ్ స్టోరీ ‘అసలేం జరిగింది’. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుహుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను అతి త్వరలో రిలీజ్ చెయ్యటానికి  చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే సరికొత్త ప్రయత్నంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.  తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత కాలం విరామం తరువాత హీరో శ్రీ రామ్ నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంచితా పదుకొనే  హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే  సస్పెన్స్, మిస్టరీ  లవ్ స్టోరీగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల  ముందుకు రాబోతుంది . ఈ చిత్రం ద్వారా కెమెరామెన్  ఎన్.వి.ఆర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు, రోజా పూలు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన శ్రీరామ్ హీరోగా అలరించబోతున్నాడు. ఎక్సోడస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతగా నీలిమ, సహ నిర్మాతగా కింగ్ జాన్సన్ కొయ్యడ వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఉత్కంఠను రేకెత్తించేలా తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ప్రేమ కథా  చిత్రంగా అసలేం జరిగింది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మహావీర్ ,  చిర్రావూరి విజయ్ కుమార్, డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మీ రాసిన చక్కని పాటలకు మ్యూజిక్  అందించారు.  ఇక ఈ సినిమాకు సంబంధించి  టీజర్ విడుదల చెయ్యటానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తుంది. త్వరలో అందరినీ ఆకట్టుకునే ఈ చిత్రం అసలేం జరిగింది ప్రేక్షకుల ముందుకు రానుంది.

tags : asalem jarigindi,  hero sriram, sanchita padukone , suspense love story, exodus media , tollywood

రేవంత్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

డెంగ్యూ జ్వరాల పై హైకోర్టు సీరియస్

Related posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *