ట్రెండ్ క్రియేట్ చేయనున్న‘అసలేం జరిగింది’?

Asalem Jarigindi New Trend In Horror

కొన్ని సినిమాలు రూపుదిద్దుకుంటున్నప్పుడు తెలియదు.. అవి ట్రెండ్ సెట్టర్స్ అవుతాయని. అందుకు కారణం కంటెంట్. జానర్ ఏదైనా కంటెంట్ బలంగా ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. ఇక అలాంటి బలమైన కంటెంట్ తో పాటు ఇప్పటి వరకూ తెలుగు సినిమాలో కనిపించని కథనంతో రాబోతోన్న సినిమా ‘అసలేం జరిగింది..?’. ఇలాంటి సినిమా ఇంతకు ముందు తెలుగులో రాలేదు అని నిర్మాత బలంగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగాన సినిమా పోస్టర్స్ నుంచి టీజర్స్ వరకూ వెరీ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి.

ఇవాళా రేపు ప్రేక్షకులు పోస్టర్ చూసే చెబుతున్నారు. ఇది ఏ సినిమా నుంచి ఇన్స్ స్పైర్ అయ్యారు అని. అలాంటి ఊహలకు తావు లేకుండా ఊహలకు కూడా అందని కథనంతో మెస్మరైజ్ చేయబోతోన్న సినిమా ఇది అంటున్నారు. ఒకప్పుడు హారర్ సినిమా అనగానే ఓ మూసధోరణిలో సాగింది. ప్రేమకథా చిత్రమ్ తర్వాత హారర్ కామెడీ అంటూ ఓ కొత్త జానర్ సెట్ అయింది. ఆ జానర్ కూడా ఇప్పుడు అవుట్ డేటెడ్ అనిపించుకుంది. ఇలాంటి టైమ్ లో ఈ జానర్ నుంచి మరో ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా వస్తోంది అసలేం జరిగింది..?  కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా.. కంటెంట్ లో రాజీ పడకుండా.. ఇలాంటి సినిమాను ఎప్పుడూ చూడలేదు అని చూసిన ప్రతి ప్రేక్షకుడూ ఓ కొత్త అనుభూతికి గురయ్యేలాంటి కథనంతో వస్తోన్న సినిమా అంటున్నారు.

కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న అసలేం జరిగింది మూవీ తెలుగులో ఖచ్చితంగా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని బలంగా చెబుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి హారర్ లో మరో కొత్త ట్రెండ్ రాబోతోంది. ఈ మూవీ తర్వాత దీన్ని అనుసరిస్తూ మరెన్నో కథలు వస్తాయి.. అని వ్యాఖ్యానిస్తుండటం విశేషం. మరి ఆ స్థాయి కంటెంట్ తో వస్తోన్న ఈ సినిమాను ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ టీజర్, ట్రెయిలర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ టీజర్ తోనే ఇది ఏ రేంజ్ సినిమా అనేదానిపై ప్రేక్షకులు ఓ అంచనాకు వస్తారని చెప్పొచ్చు. తెలుగువాడైనా తమిళ్ లో సెటిల్ అయిన శ్రీకాంత్(రోజాపూలు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఫేమ్) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఎక్సోడస్ మీడియా బ్యానర్ లో  కె నీలిమ నిర్మించారు.

#Asalem Jarigindi Creates New Trend In Horror, #SriramSanchita,#AsalemJarigindi,Exodusmedia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *