అశ్వథ్థామ – ట్రైలర్ టాక్

Ashwathama Trailer Talk

నాగశౌర్య, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. రమణతేజ్ డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ రూపొందించింది. ఇక సినిమా ఆరంభం నుంచీ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు శౌర్య. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ టైమ్  ఓ పూర్తి స్థాయి మాస్ మూవీ చేశాడని ఈ ట్రైలర్  చూస్తేనే తెలిసిపోతోంది. కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన టీజర్ తో ఆకట్టుకున్న శౌర్య ఈ సారి ట్రైలర్ తో మాత్రం కొన్ని డౌట్స్ వదిలాడు.

ట్రైలర్ మొత్తం గ్రిప్పింగ్ గానే సాగినా.. గతంలో ఇదే సైట్ లో మనం చెప్పినట్టుగా.. ఈ మూవీ రాఖీ తరహా ఆడవాళ్లపై జరిగే అమానుషాలపై గళమెత్తిన ఓ యువకుడి కథ అనిపిస్తోంది. మామూలుగా మొదట్లో తన చెల్లెలు అనుమానాస్పదంగా మరణించడంతో దానిపై ఎంక్వైర్ చేసే హీరోకు మరికొందరు యువతులు కూడా అలా చనిపోయినట్టు తెలుస్తుంది. అందుకు కారణం ఎవరు.. దీని వెనక ఎవరున్నారు అనే ఇన్వెస్టిగేషన్ మోడ్ లో సాగుతూ థ్రిల్లర్ తరహాలో సాగే కథనంగా కనిపిస్తోంది.
అయితే ఇలా అమ్మాయిలు మిస్ కావడం లేదా మర్డర్ కు గురి కావడం.. దాని వెనక ఓ మిస్టీరియస్ పర్సన్ ఉండటం.. అది చివరి వరకూ తెలియకపోవడం అనే కాన్సెప్ట్స్ తో చాలా సినిమాలు వచ్చాయి. మరి వాటికి ఎంత భిన్నంగా ఈ సినిమా కనిపిస్తుందో కానీ.. ట్రైలర్ చూస్తే మాత్రం రీసెంట్ గా వచ్చిన రాక్షసుడు సినిమా కూడా గుర్తొస్తోంది.

Ashwathama Trailer Talk,theatrical trailer,#Nagashaurya,#Ashwathama Trailer,#Mehreen Pirzada,అశ్వద్ధామ,Shaurya Ashwathama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *