పంచాంగం వర్సెస్ సైన్సు

Spread the love

Astrology VS Science .. వర్షాలు పడతాయా లేదా ?

పంచాంగం వర్షాలు పడతాయి. పాడిపంటలతో ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అని చెప్పింది. ఇక సైన్సు ఈసారి వర్షాలు తక్కువగా పడతాయని చెబుతోంది. ఈ రెండు విన్నవారు పంచాంగం నమ్మాలా లేక సైన్స్ ని నమ్ముకోవాలా అంటూ తర్జనభర్జన పడుతున్నారు.
ఈ ఏడాది లోటు వర్షపాతం ఉంటుందని, గడ్డు పరిస్థితులు వస్తాయని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమె‌ట్‌ హెచ్చరిస్తుంటే ఉగాది పంచాంగకర్తలు మాత్రం ఈ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, బంగారు పంటలు పండి రైతులు సుఖసంతోషాలతో ఉంటారని చెబుతున్నారు.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రైతన్నలు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమె‌ట్‌ హెచ్చరించింది. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించింది. నైరుతి రుతుపవనాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవన్న స్కైమెట్‌ ఎల్‌నినో ఇండెక్స్‌ గరిష్ట విలువను అధిగమించి భయపెడుతోందని తెలిపింది. జూన్ ఫస్ట్‌ వీక్‌లో భారత్‌లోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్‌ పడనుందని, దాంతో ఈ ఏడాది కూడా లోటు వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని ప్రకటించింది. అంతేకాదు జూన్‌, జులైలో పరిస్థితి మరింత గడ్డుగా ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది లోటు వర్షపాతం ఉంటుందని, గడ్డు పరిస్థితులు వస్తాయని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమె‌ట్‌ హెచ్చరిస్తుంటే పంచాంగ కర్తలు అబ్బే అలా ఏం లేదు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్తున్నారు . చూడాలి మరి ఎవరి మాట నిజం అవుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *