గన్ పార్కు వద్ద అశ్వద్ధామరెడ్డి అరెస్ట్

Aswathhama Reddy Arrest

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గజగజలాడిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని పోలీసులు సోమవారం ఉదయం గన్ పార్కు వద్ద అరెస్టు చేశారు. అమరుల త్యాగాల వల్ల కేసీఆర్ సీఎం అయ్యారన్న విషయం మర్చిపోయారా నిలదీశారు. అలాంటి అమరులకు నివాళులు అర్పించి హక్కు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమకు న్యాయం చేసేదాకా
ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణలు త్వరలో వెల్లడిస్తామన్నారు.  ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టినా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపటం లేదు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేసినటువంటి తమ కోరికలను ప్రభుత్వం నెరవేర్చని కారణంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా శుక్రవారం సాయంత్రం నుండి సమ్మె చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులపై ఆగ్రహించినటువంటి ప్రభుత్వం వారికీ ఒక డెడ్ లైన్ ని విధించింది. కాగా శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ కార్మికులు తమ తమ విధులకు హాజరు కానీ పక్షాన వారిని తమ ఉద్యోగాలనుండి తొలగిస్తామని అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రభుత్వం విధించిన ఈ డెడ్ లనే ని పట్టించుకోని ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెని ఎదావిదిగా కొనసాగిస్తున్నారు.

ముందుగా తనని తొలగించాలన్న అశ్వత్థామ
టీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి రానున్న రెండు రోజులకు గాను తమ భవిష్యత్ కార్యాచరణను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు రోజుల భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా ఆదివారం నాడు ఆర్టీసీ కి సంబందించిన అన్ని రాజకీయ పార్టీలు, యూనియన్లు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్ధి సంఘాల మద్దతు కోరుతూ పలు లేఖలు ఇస్తామని, ఉదయం 11 గంటలకు ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. అంతేకాకుండా తెలంగాణలోని అన్ని డిపోల వద్ద కార్మిక కుటుంబాలు బతుకమ్మ ఆడుతాయని స్పష్టం చేశారు. ఆతరువాత సోమవారం నాడు ఉదయం 8 గంటలకు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి, అనంతరం ఇందిరాపార్క్ వద్ద నిరాహారదీక్ష చేపడతామని, ఎవరైనా తమని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

* విధులకు హాజరు కానీ కార్మికుల్ని తమ ఉద్యోగం నుండి తొలగిస్తామని ప్రభుత్వం బయపెడుతుందని, ఒకవేళ నిజంగానే అలా ఉద్యోగాలను తొలగించే పరిస్థితే ఎదురైతే మాత్రం ముందుగా తననే తొలగించాలని ఎస్‌ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయం తేల్చి చెప్తున్న నేపధ్యంలో వివిధ రూపాల్లో నిరసన తెలియజేసినా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని తమ డిమాండ్ల విషయంలో ఒప్పించటంలో సక్సెస్ అవుతారా అన్నది ప్రశ్నే. ఈ క్రమంలో సోమవారం ఉదయం గన్ పార్కు వద్దకు వెళ్లిన జేఏసీ నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు.

tags : tsrtc rtc strike, action plan, JAC convenor, ashwatthama reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *