క్యాష్‌ విత్‌డ్రాకు ఓటీపీ..

ATM Cash Withdrawals With OTP Only

OTP ద్వారానే ఏటీమ్ లో డబ్బులు డ్రా

జనవరి 1 అమలు.. SBI నిర్ణయం..

ఏటీఎం కార్డు జేబులో ఉండగానే మనకు తెలియకుండా ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తున్న ఫిర్యాదులు ఇటీవల సైబర్‌క్రైమ్‌ పోలీసులకు విపరీతంగా వస్తున్నాయి. ఏటీఎం కార్డులు ఖాతాదారుల వద్ద ఉండగా..ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయంటే గుర్తుతెలియని వ్యక్తులు ఆయా బ్యాంకు కార్డులను క్లోనింగ్‌ చేసి ఉంటారు. ఈ నేపథ్యంలోనే నగదు అక్రమలావాదేవీలు, ఏటీఎం మోసాలను అరికట్టేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 1, 2020 నుంచి ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి క్యాష్‌ విత్‌ డ్రా చేసుకోవాలంటే వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ)తోనే నగదు డ్రా చేసుకోగలరు.

రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. పదివేలు, అంతకన్నా ఎక్కువ క్యాష్‌ ఉపసంహరణకు ఓటీపీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఏటీఎం క్యాష్‌ విత్‌డ్రా సమయంలో ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అక్రమ, అనుమానాస్పద నగదు లావాదేవీలకు చెక్‌పెట్టేందుకు కొత్త సదుపాయం తీసుకొచ్చినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *