టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్

Spread the love

AUS ELECTED TO BAT FIRST

భారత్, ఆసీస్ జట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ప్రారంభమైంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-2తో సమంగా ఉన్న భారత్‌, ఆసీస్‌ ఈ నిర్ణయాత్మక చివరి పోరులో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ పిచ్‌పై భారీ స్కోర్‌ చేసి కాపాడుకుంటామని పించ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, చేజింగ్‌లో తమది గొప్పజట్టని, అది మరోసారి నిరూపిస్తామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. భారత తుది జట్టులోకి చహల్‌, రాహుల్‌ స్థానాల్లో జడేజా, షమీలు రాగా.. ఆసీస్‌ తుది జట్టులోకి షాన్‌ మార్ష్‌, బెహండ్రాఫ్‌ స్థానాల్లో మార్కస్‌ స్టొయినిస్‌, నాథన్‌ లయన్‌లు వచ్చారు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ ఆధిపత్యం కనబర్చిన భారత్‌ చివరి రెండు మ్యాచ్‌లను అనూహ్యంగా ఓడి సిరీస్‌ ఫలితాన్ని చివరి మ్యాచ్‌ వరకు తీసుకొచ్చింది. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *