ఆఫ్గాన్ పై ఆసీస్ దే గెలుపు

Spread the love

AUSTRALIA BEAT AFGHAN

  • ఎలాంటి సంచలనానికీ తావివ్వని కంగారూలు
  • ఏడు వికెట్ల తేడాతో గెలుపు

ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ పేలవంగా సాగుతోంది. ఇప్పటికే విండీస్-పాక్ మ్యాచ్ తోపాటు లంక-కివీస్ మ్యాచ్ ఏకపక్షంగా సాగగా.. శనివారం ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా సాదాసీదాగానే జరిగింది. అయితే.. పాక్, లంక జట్లతో పోలిస్తే ఆఫ్గాన్ జట్టు చాలా మెరుగ్గానే ఆడింది. ఎలాంటి సంచలనానికీ తావివ్వకుండా కంగారూలు అలవోకగా తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఆఫ్గాన్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించారు. డేవిడ్‌వార్నర్‌(114 బంతుల్లో 89), ఆరోన్‌ ఫించ్‌(49 బంతుల్లో 66) రాణించడంతో 34.5 ఓవర్లలోనే ఆసీస్ తన లక్ష్యాన్ని చేరుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఈ క్రమంలో రహ్మత్‌షా (60 బంతుల్లో 43), హష్మతుల్లా షాహిది (34 బంతుల్లో 18) నిలకడగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ప్రమాదకరంగా మారుతున్నఈ జోడీని జంపా పెవిలియన్‌ పంపించాడు. వెంటనే మహ్మద్‌ నబీ(7) కూడా ఔట్ కావడంతో ఆఫ్గాన్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ గుల్బాడిన్‌ నైబ్‌(33 బంతుల్లో 31), నజీబుల్లా జద్రాన్‌(49 బంతుల్లో 51) రషీద్‌ఖాన్‌(11 బంతుల్లో 27) రాణించడంతో ఆఫ్గాన్ స్కోరు 200 పరుగులు దాటింది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *