పట్టపగలు పంజాగుట్ట నడిరోడ్డు మీద హత్య

Auto Driver Killed in Panjagutta

నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. పంజాగుట్టలో ఆటో డ్రైవర్ రియాసత్ అలీ అనే వ్యక్తిని కత్తులతో కొందరు దుండగులు ఆదివారం హత్య చేసి చంపారు.  మూడు నెలలు క్రితం ఆటో డ్రైవర్ అన్వర్ ను పంజాగుట్ట లో హత్య చేయగా.. ఆ కేసులో రియాసత్ అలీ నిందితుడుగా ఉన్నాడు.  కొద్దీ రోజులు క్రితమే రియాసత్ అలీ బెయిల్ పై బయటకి వచ్చాడు. దీంతో అదను కోసం కాపుకాసిన దుండగులు, టీ తాగడానికి వచ్చిన ఆటో డ్రైవర్ రియాసత్ అలీ ని కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. గతంలో హత్య గురైన అన్వర్ స్నేహితులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

hyderabad crime updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *