నిలిచిపోనున్న ఆటోమేటిక్ చెల్లింపులు

7

వివిధ రకాల బిల్లులకు సంబంధించి ఆటోమేటిక్ విధానంలో చెల్లించే విధానానికి రిజర్వు బ్యాంకు బ్రేక్ వేసింది. ఇకపై అదనపు ధ్రువీకరణ లేకుండా ఆటోమేటిక్ విధానంలో బిల్లుల చెల్లింపు కుదరదని స్పష్టంచేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని బ్యాంకులతోపాటు పేమెంట్ గేట్ వే సంస్థలకు స్పష్టంచేసింది. అదనపు ధ్రువీకరణ లేకుండా కార్డులు, ప్రీపెయిడ్ పేమెంట్ పద్ధతులు, యూపీఐ వినియోగించి చేస్తున్న చెల్లింపులను నిలిపివేయాలని ఆర్బీఐ గతేడాది 4న ఆదేశించింది. లావాదేవీలకు సంబంధించిన రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్స్ ఉన్న బిల్లుల చెల్లింపు కుదరదు. వాటిని నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు, పేమెంట్ గేట్ వే సంస్థలు ఈ కొత్త మార్గదర్శకాలు అమలుకు కొంత గడువు ఇవ్వాలని కోరుతున్నాయి. కానీ ఆర్బీఐ మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాల్సిందేనని స్పష్టంచేస్తోంది.