అయోధ్య భూమి  హిందువులదే

AYODHA LAND BELONGS TO HINDUS

దేశవ్యాప్తంగా  తీవ్ర ఉత్కంఠ రేపిన  సుదీర్ఘమైన,  అతి సున్నితమైన అయోధ్య వివాదం  కేసులో  సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడించింది.  ఈ వివాదానికి  సుప్రీంకోర్టు ధర్మాసనం ముగింపు పలికింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం  ఏకాభిప్రాయంతో అయోధ్య కేసుపై తీర్పును  వెలువరించింది.  ఉత్కంఠభరితంగా సాగిన  జస్టిస్ రంజన్ గొగోయ్  తీర్పులో  ముందుగా… అయోధ్య భూమి హక్కుపై షియా వక్ఫ్ బోర్డ్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.  అయితే బాబ్రీ మసీదును బాబు నిర్వహించలేదని  బాబర్ దగ్గర పనిచేసిన దగ్గర పనిచేసిన  కమాండర్ షియా  నిర్మించారని, వివాదాస్పద భూమి తమదేనని షియా వక్ఫ్ బోర్డు తన పిటిషన్‌లో తెలిపింది. దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో… వివాదాస్పద భూమి షియా వక్ఫ్ బోర్డ్‌ది కాదని స్పష్టమవుతోంది.

తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్… ప్రజల విశ్వాసాల్నీ, నమ్మకాల్నీ సుప్రీంకోర్టు గౌరవిస్తుందని తెలిపారు. బాబర్ కాలంలో మసీదు నిర్మాణం జరిగిందన్న సుప్రీంకోర్టు… ఐతే… కచ్చితంగా మసీదు ఎప్పుడు నిర్మించిందీ స్పష్టం కాలేదని తెలిపింది.  ఇక అంతే కాకుండా  నిర్మోహి అఖాడి పిటిషన్ ను సైతం  కొట్టివేసిన కోర్టు   అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువుల దేనని పేర్కొంది.  అయితే కొన్ని కండిషన్ లతో హిందువులకు అయోధ్య భూమి చెందుతుందని  తీర్పులో వెల్లడించింది.  కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని,  అలాగే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని ఐదెకరాల స్థలం సున్నీ వక్ఫ్ బోర్డుకు  కేటాయించాలని పేర్కొంది

tags : Ayodhya verdict, Supreme Court, central government,  Ranjan Gogoi, Chief justice of india, shiya board petition, nirmohi akhada petition, dismissed, Hindus

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో అమిత్ షా భేటీ

అయోధ్య తీర్పు పై షియా బోర్డు పిటిషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *