దీపావళి నేపధ్యంలో తెరపైకి అయోధ్య వివాదం

Ayodhya controversy

అయోధ్య వివాదం మళ్ళీ తెరమీదకు వచ్చింది. దీపావళి నాడు వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థలంలో దీపాలు వెలిగించేందుకు విశ్వ హిందూ పరిషత్ అనుమతి కోరగా అయోధ్య జిల్లా యంత్రాగం అనుమతి నిరాకరించింది. దీపాలంకరణ కోసం అనుమతి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించింది. కాగా నిన్న వీహెచ్‌పీ ప్రతినిధి శరద్ శర్మ మాట్లాడుతూ… మత పెద్దలు ఆ రోజు రామ మందిరంలోకి వెళ్లి, దేవుడి ముందు దీపాలు వెలిగిస్తారంటూ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో దీపావళి నాడు దీపాలంకరణ కోసం వీహెచ్‌పీ నాయకులు ఫైజాబాద్ డివిజినల్ కమిషనర్ మనోజ్ మిశ్రాను సంప్రదించారు. సుప్రీం ఆదేశాల ప్రకారం వివాదాస్పద స్థలానికి ఇంచార్జి అధికారి ఆయనే కావడంతో ఈ విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలంటూ వీహెచ్‌పీ నేతలు కోరారు. దీనిపై మిశ్రా స్పందిస్తూ ‘‘వివాదాస్పద స్థలంలో కొత్తగా ఎలాంటి మత కార్యకలాపాలు చేపట్టకూడదు. సుప్రీంకోర్టు అనుమతించిన కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.’’ అని స్పష్టం చేశారు. 1993 జవవరి 7న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం… ప్రధాన పూజారి నిర్వహించే రోజువారీ పూజలు, నైవేద్యాలు తప్ప వివాదాస్పద స్థలంలో ఎలాంటి మత కార్యకలాపాలు నిర్వహించ కూడదు అని తెలుస్తుంది. మరోవైపు దీపాలంకరణ కోసం వీహెచ్‌పీ నేతలు అనుమతి కోరడాన్ని ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయోధ్య ఆవరణంలో దీపావళి వేడుకలకు అనుమతి ఇస్తే, తమకు  నమాజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ముస్లిం లు డిమాండ్ చేస్తున్నారు .

tags : ayodhya case, supreem court, rama janmabhoomi, babree masjid , vhp , muslims , diwali

అప్పుడు  చంద్రబాబునే  బెదిరించా అన్న ఎర్రబెల్లి

ఆర్టీసీ కార్మికులతో పాటు రెవెన్యూ ఎంప్లాయిస్ సమ్మె బాట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *