అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో చెలరేగితే జైలుకే

Ayodhya verdict social media posts ban

అయోధ్య లో రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు క్షణాల్లో సంచలన తీర్పు ఇవ్వనుంది. అయోధ్య వివాదం సుదీర్ఠకాలంగా నలుగుతోంది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు తమదంటే తమదంటూ హిందూ-ముస్లీంలు కలహించుకుంటున్నారు. దీనిపై ఎన్నెన్నో కోర్టు కేసులు, మరెన్నో వివాదాలు. ఈ కోర్టు కేసులు, వివాదాలకు క్షణాలలో తెరపడనుంది. సుప్రీం కోర్టు తీర్పు ఏదైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చెయ్యడం నిషేధించారు. సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేసే వారికి నో వార్నింగ్, నో వారెంట్, నేరుగా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు.అయోధ్య అంశం పైన తీర్పు వస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు అప్రమత్తమయ్యారు. తీర్పు పైన ఎవరైనా అనుచింతగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వాలు స్పష్టం చేసాయి. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారి మీద గ్యాంగ్ స్టర్ యాక్ట్ తో పాటుగా..జాతీయ భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర్పు వెల్లడికి ముందుగాని..తర్వాతగానీ వాట్సప్‌..ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టాగ్రాం.. ట్విట్టర్‌తో సహా ఏ సోషల్‌ మీడియా మాధ్యమం ద్వారానైనా హింసను ప్రేరేపించేలా చేసినా.. మతవిద్వేషాలను రగిలించేలా.. విద్వేషపూరిత పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
tags : Ayodhya verdict, Supreme Court, central government,  Ranjan Gogoi, Chief justice of india, social media posts, ban

నేడే అయోధ్య తీర్పు

గవర్నర్ తో భేటీ కానున్న ఆర్టీసీ కార్మికులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *