‘అయ్యప్పనుమ్’కు మళ్లీ దర్శకుడు మారాడా?

ayyappanum director change?

ఓ దశాబ్ధం క్రితం తెలుగు సినిమాను డబ్బింగ్ సినిమాలు ఓ రేంజ్ లో భయపెట్టాయి. ఆ సినిమాలన్నీ ఇక్కడ అనూహ్య విజయాలు సాధించాయి. అందుకు కారణం మన సినిమా కథలన్నీ మూసగా ఉండటమే. కట్ చేస్తే మనవాళ్లూ మారారు. మంచి కథలు చూపుతున్నారు. అయితే మామూలుగా రీమేక్ లపై చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపించే టాలీవుడ్ .. ఈ మధ్య మాలీవుడ్ మూవీపై మోజు పెంచుకుంటోంది. ఈ క్రమంలో అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా ఈ మూవీ దర్శకుడు కూడా మారాడు అనే వార్తలు వస్తున్నాయి.
కంటెంట్ బలంగా ఉంటే కలెక్షన్స్ వస్తాయి. కానీ ఆ కంటెంట్ చూపిస్తోన్న భాషకు కూడా రిలేట్ అయి ఉండాలి. అందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పర్ఫెక్ట్ యాక్టర్స్ కూడా సెట్ కావాలి. అలా కొన్నాళ్లుగా నిరంతరం న్యూస్ లో ఉంటూ.. వస్తోన్న అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి హీరోలు సెట్ అయ్యారు. పృథ్వీరాజ్ పాత్రలో రానా, బిజు మీనన్ పాత్రలో రవితేజ నటించేందుకు ఒప్పుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందబోతోన్న ఈ చిత్రానికి ముందుగా బాలకృష్ణను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. రానా ముందు నుంచీ ఆ పాత్రకు ఓకే అంటున్నాడు. బిజు మీనన్ క్యారెక్టర్ కోసమే మరి కొంతమంది హీరోలను కూడా అడిగారు. బట్ ఫైనల్ గా ఆ ఈగోయిస్టిక్ పోలీస్ పాత్రకు రవితేజ ఓకే చెప్పాడు. అయితే రీమేక్స్ ను హ్యాండిల్ చేయాలంటే ఒకప్పుడు తెలుగులో రవిరాజా పినిశెట్టి, భీమనేని శ్రీనివాసరావు కనిపించేవారు.

కానీ ఇప్పుడు ఎవరికి వారే సొంత కథలతో దూసుకుపోతున్నారు. అందుకే ఇలాంటి కథలను హ్యాండిల్ చేయడం అంటే అందరితోనూ అయ్యే పనికాదు. కొందరు ఉన్నా.. వారంతా సొంత ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ముందుగా హరీశ్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే అతను ఉంటే హీరో కూడా మారి ఉండేవాడేమో. బట్.. హీరో నో చెప్పడంతో హరీష్ కూడా తప్పుకున్నాడు. అటుపై షాట్ డివిజన్ లో ప్రత్యేకత చూపించే సుధీర్ వర్మ ఫైనల్ అయ్యాడు అన్నారు. కానీ అతను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నాడు అంటున్నారు. చేసింది రెండు సినిమాలే అయినా.. మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న దర్శకుడు సాగర్ చంద్ర పేరు ఇప్పుడు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు దర్శకుడుగా వినిపిస్తోంది. సాగర్ చంద్ర గతంలో అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలతో చాలా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అప్పట్లో ఒకడుండేవాడు తెలుగు సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచే చిత్రం. అలాంటి దర్శకుడికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం చాలా వరకూ మంచి డెసిషన్ అనే చెప్పాలి. అయితే ఈ మధ్య ఈ సినిమా విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. అందువల్ల నిజంగా సుధీర్ వర్మ తప్పుకోవడం వల్ల సాగర్ చంద్రకు అవకాశం వచ్చిందా.. లేక ఇది కూడా రూమరా అనేది తేలాల్సి ఉంది.

cinema news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *