చంద్రబాబుకు భలే ఛాన్స్!

BABU READY TO FIGHT ON YCP

  • బడ్జెట్ పై రాష్ట్రానికి కేటాయింపులు నిల్
  • ఇంకా పెదవి విప్పని జగన్
  • వైఎస్సార్ సీపీపై పోరుకు టీడీపీ అధినేత రెడీ

ఎన్నికల్లో ఓటమి తర్వాత సంక్షోభంలో చిక్కుకున్న టీడీపీకి తిరిగి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేతకు చక్కని ఛాన్స్ వచ్చింది. నేతల జంపింగులతో అయోమయంలో పడిన పార్టీని గాడిలో పెట్టేందుకు మంచి అవకాశం చేజిక్కింది. ఇప్పటికే రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కోసం అన్నదాతలు ఆందోళన చేస్తుండటం, ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరగడం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని బాబు భావిస్తున్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమీ లేకపోయినా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడకపోవడాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. తనపై కేసులు ఉన్నందునే జగన్ ఈ విషయంలో ఏమీ మాట్లాడలేకపోతున్నారనే అంశాన్ని బాగా ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో బీజేపీని విమర్శిస్తూనే వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావిస్తునట్టు తెలుస్తోంది. గతంలో వైఎస్సార్ సీపీ అనుసరించిన వ్యూహాన్నే తాము ఇప్పుడు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంపై బీజేపీని విమర్శించకుండా టీడీపీనే లక్ష్యంగా చేసుకోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. మనం కూడా అలాగే ముందుకెళ్లాలని నేతలకు బాబు సూచించినట్టు సమాచారం. మొత్తమ్మీద స్తబ్ధుగా ఉన్న టీడీపీకీ బడ్ట్ రూపంలో మంచి అస్త్రం దొరికినట్టయింది.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *