ఆ యువహీరోల టైం బాలేదు

Spread the love

Bad Time for young Heros

టాలీవుడ్ యువ హీరోలు ఆస్పత్రి పాలవుతున్నారు. ముగ్గురు యువహీరోలు షూటింగ్ లో ప్రమాదాలకు గురయ్యారు. విశాఖలో నాగశౌర్య, కర్నూలులో సందీప్ కిషన్, థాయ్‌లాండ్‌లో శర్వానంద్ ప్రమాదాలకు గురయ్యారు. ఇవన్నీ.. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే చోటు చేసుకున్నాయి. అందరికీ… కాస్త తీవ్రమైన దెబ్బలే తగలడంతో.. షూటింగులన్నీ ఎక్కడివక్కడ నిలిపి వేయాల్సి వస్తోంది.
థాయ్ లాండ్‌ షూటింగ్‌లో శర్వానంద్ తీవ్రంగా గాయపడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం శర్వానంద్ తమిళ రీమేక్ మూవీ 96లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. అక్కడ ఓ స్కైడైవింగ్ సీన్ చేయబోయిన శర్వానంద్ పట్టు తప్పి కింద పడిపోయాడు. భుజానికి తీవ్ర గాయం కావడంతో.. అక్కడే ప్రాథమిక చికిత్స చేయించుకుని.. హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడ సన్‌షైన్ ఆస్పత్రిలో చేరారు. గాయం తీవ్రంగా ఉండటంతో.. భుజానికి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. దీంతో.. 96 సినిమా షూటింగ్.. నెల రోజుల పాటు ఆగిపోయే అవకాశం ఉంది. శర్వానంద్‌ గాయం విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.

మరో ఇద్దరు యువహీరోలు.. ఏపీలో షూటింగ్‌లలో పాల్గొంటూ.. ప్రమాదాలకు గురయ్యారు. సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌లో.. ఫైట్ సీన్ చేస్తూ.. నాగసౌర్య… సాహసం చేయడంతో.. పరిస్థితి చేయిదాటిపోయింది. కాలికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. రెండు నెలల పాటు ఆ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లయింది. వరుసగా ఇంత మంది హీరోలకు ప్రమాదాలా..? సందీప్ కిషన్ కూడా… గాయపడిన యువహీరోల జాబితాలో ఉన్నారు. ఆయన కర్నూలులో తెనాలి రామకృష్ణ.. అనే సినిమా షూటింగ్‌ కోసం బ్లాస్టింగ్ సీన్‌లో పాల్గొంటూ ఉండగా ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అంతకు ముందు.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. షూటింగ్‌లో.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ ఇద్దరికీ గాయాలయ్యాయి. అందులో.. ఆసినిమా షూటింగ్ వాయిదా పడింది. చాణక్య మూవీ షూటింగ్‌లో సీనియర్ హీరో గోపిచంద్ సైతం గాయపడ్డాడు. డియర్ కామ్రేడ్ షూటింగ్ సమయంలో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గాయపడ్డాడు. హీరో వరణ్ తేజ్ .. షూటింగ్‌కు వెళ్తూ.. ప్రమాదం బారి నుంచి తృటిలో బయటపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *