నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లు

9
BAINSA RIOTS AGAIN
BAINSA RIOTS AGAIN

BAINSA RIOTS AGAIN

భైంసాలోని జుల్ఫెకర్ గల్లీలో అల్లర్లు ఆదివారం రాత్రి చెలరేగాయని తెలిసింది. యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ ఘర్షణకు దారి తీసిందని సమాచారం. పెద్ద మొత్తంలో గొడవ జరగడంతో ఇరువర్గాలు వారు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారని తెలిసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. పోలీసులు అల్లర్లను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాకపోతే, అల్లరి మూకలు మాత్రం వాహనాలకు, కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టారని తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అర్పడానికి ప్రయత్నిస్తుండగా.. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

BAINSA RIOTS LATEST UPDATES