ఏపీ రాజకీయాల్లో బంట్రోతు వ్యాఖ్యలపై బాలయ్య ఏమన్నారంటే

Spread the love

Balakrishna Response on Bantrothu Comments

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక ఏపీ రాజకీయాల్లో బంట్రోతు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలను బంట్రోతు అనడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాప్రతినిధులంతా ప్రజలకు బంట్రోతులే అని బాలయ్య చెప్పారు. ప్రజల ద్వారా ఎన్నికైన వారందరూ ప్రజలకు సేవ చేయాల్సిందే అని బాలకృష్ణ స్పష్టం చేశారు.ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉందన్నారు. బీసీల సంక్షేమం గురించి ప్రసంగంలో ప్రస్తావన లేదన్నారు. ప్రాజెక్టులు వేరే ప్రభుత్వాలు ప్రారంభించినా.. పూర్తి చేసింది మాత్రం టీడీపీ ప్రభుత్వమే అన్నారు. ప్రతిష్టాత్మకమైన నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాజెక్ట్ గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం బాధాకరం అన్నారు.

అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే.. సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని కుర్చీలో కూర్చోబెట్టేందుకు సీఎం జగన్ స్వయంగా వెళ్లారు. ప్రతిపక్షం నుంచి చంద్రబాబు మాత్రం హాజరుకాలేదు. ఈ విషయంపై దుమారం రేగింది. స్పీకర్‌కు ప్రతిపక్షం గౌరవం ఇవ్వలేదని వైసీపీ మండిపడింది. చంద్రబాబు రాకుండా ఆయన బంట్రోతు అచ్చెన్నాయుడిని పంపారు అంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.దీంతో సభలో బంట్రోతు వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను బంట్రోతు అనడం ఏంటంటూ అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేను చంద్రబాబు బంట్రోతు అయితే, మీ 150 మంది జగన్ బంట్రోతులు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడీ వివాదంపై బాలయ్య కూడా స్పందించారు. ఎమ్మెల్యేలంతా బంట్రోతులే అని తేల్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *