మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా? ఇవ్వడా?

Balayya Clarity on Mokshagna entry

నందమూరి బాలకృష్ణ, నందమూరి రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఇక ఇప్పటివరకు లేటు వయసులో కూడా పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్న బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓ వైపు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు టాలీవుడ్లో దూసుకుపోతున్నారు. మరోపక్క అక్కినేని వారసులు ఇంకోపక్క దగ్గుబాటి వారసుడు సినిమాలలో తమ దూకుడు చూపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ కూడా వీలైనంత త్వరగా ఎంట్రీ ఇవ్వాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదుగో అప్పుడు.. అదుగో అప్పుడు అంటూ గత రెండు సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ మధ్యన అవి కాస్త ఎక్కువయ్యాయి. బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కిస్తోన్న మూవీ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతుంది . అంతేకాదు బాలయ్యతో మూవీ తరువాత బోయపాటి, మోక్షజ్ఞ‌తో సినిమా తీస్తాడని కూడా ఇలావార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నందమూరి సింహం మోక్షజ్ఞ వస్తున్నాడు ఇక అరుపులే అంటూ అతడికి చెందిన ఓ ఫ్యాన్ మేడ్ లుక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ వార్తలపై నందమూరి బాలకృష్ణ తన స్పందన తెలియజేశారు. మోక్షజ్ఞ ఎంట్రీపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని, అతడి ఎంట్రీ ఇప్పుడే ఉండదని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. అయితే సినిమాల్లోకి వచ్చేందుకు మోక్షజ్ఞ అంత ఆసక్తిని చూపలేదని అతడి ధ్యాస సినిమాలపై మళ్లించేందుకే అప్పట్లో బాలయ్య పూజలు కూడా చేయించాడని వార్తలు వచ్చాయి. మరి నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అన్నది వేచి చూడాల్సిందే.

Tags: mokshagna , namdamoori balakrishna, movies, entry, fans

రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన లో అవాక్కయ్యే ఘటన

దేశవ్యాప్తంగా187 ప్రాంతాలలో  సిబిఐ దాడులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *